కెటిఆర్‌, రజీనీకాంత్‌లకు ఛాలెంజ్‌ చేసిన చిరు

‘బీ ది రియల్ మ్యాన్’ చాలెంజ్ విసిరిన ఎన్టీఆర్.. వీడియో ద్వారా సమాధానం ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi-Accepts-The-Challenge
Chiranjeevi-Accepts-The-Challenge
Chiranjeevi
Chiranjeevi

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవికి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘బీ ది రియల్‌ మ్యాన్‌’ చాలెంజ్‌ విసిరిన విషయం తెలిసిందే. అయితే ఈచాలెంజ్‌పై స్పందించిన చిరు ఛాలెంజ్‌ ని పూర్తిచేసి, సంబంధిత వీడియోను పోస్ట్ చేస్తూ తాను రోజూ ఈ పనులను చేస్తానని పేర్కొన్నారు. ఇక ఇందులో తన ఇంటి హాల్ ను వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేసిన చిరంజీవి, ఆపై వంటగదిలో చకచకా దోశ వేశారు. దాన్ని తీసుకెళ్లి తన తల్లి అంజనాదేవికి తినిపించారు. అంజనాదేవి, ఓ దోశ ముక్కను చిరుకు తినిపించారు. కాగా ‘ఇదిగో భీమ్… నేను రోజూ చేసే పనులే… ఇవాళ మీ కోసం ఈ వీడియో సాక్ష్యం. నేను ఇప్పుడు కెటిఆర్‌, రజనీకాంత్ కు ‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్‌ ని విసురుతున్నాను’ అంటూ ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/