బిఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఫై సంచలన ఆరోపణలు చేసిన యువతీ

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమను మోసం చేశాడని, తన వద్దకు అమ్మాయిలను పంపించాలని, కోర్కెలు తీర్చాలని బెదిరిస్తున్నాడని ఆరిజిన్​డెయిరీ నిర్వాహకులు శేజల్​ ఆరోపించారు. ఆయన చెప్పిన పని చేయలేదని కక్షగట్టి తప్పుడు కేసులు పెట్టించి తమను అరెస్టు చేయించాడన్నారు. ఆ మేరకు ఆమె ఓ ఆడియో, వీడియోతో పాటు కొన్ని వాట్సప్ చాటింగ్‌లను ఆమె మీడియాకు విడుదల చేశారు.

‘బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మమ్మల్ని నమ్మించి డబ్బులు తీసుకొని మాపైనే తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారు. చిన్నయ్యను మొదటిసారిగా బ్రాంచి ఓపెనింగ్‌ సమయంలో కలిశాను. మీ కంపెనీలో మా వాళ్లకు షేర్‌ ఇవ్వండి, మీకు ఫుల్‌ సపోర్టు చేస్తానని చిన్నయ్య చెప్పారు. మేం అంగీకరించడంతో రెండెకరాల స్థలాన్ని ఆయన ఆఫర్‌ చేశారు. అందుకు రూ.20 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించాం. ఆ స్థలం ప్రభుత్వానిదని నిర్ధారణ కావడంతో త్వరలోనే రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తానని ఆయన చెప్పారు. అనంతరం అందులో ప్లాంటు ఏర్పాటుకు భూమి పూజ కూడా చేశాం. ప్లాంటు కన్‌స్ట్రక్షన్‌ బాధ్యతను సాన శ్రావణ్‌, థామస్‌ అనే వ్యక్తులకు అప్పగించారు.

బిజినెస్‌ మీటింగ్‌ కోసం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తరుచుగా చిన్నయ్యను కలిసే వాళ్లం. ఈ క్రమంలో ఒకరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు నాతో పాటు మరో అమ్మాయి వచ్చింది. ఒక రోజు ఎమ్మెల్యే కాల్‌ చేసి మీతోపాటు వచ్చిన అమ్మాయిని నైట్‌కు పంపిస్తారా? అని అడిగారు. ఆ అమ్మాయి అలాంటిది కాదు… కుదరదు అని చెప్పాను. అప్పుడు.. ఏ అమ్మాయినైనా పంపించాలని ఒత్తిడి చేశారు. తెలిసిన వారి ద్వారా ఆయనకు ఓ బ్రోకర్‌ నంబర్‌ ఇచ్చి, యువతులు వెళ్లేలా ఏర్పాట్లు చేశాం. మరోసారి.. దళితబంధు విషయమై మాట్లాడాలంటూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు ఆయన నన్ను పిలిచారు. అక్కడ మాకు మద్యం ఆఫర్‌ చేశారు. అలవాటు లేదని చెప్పి తిరిగొచ్చేశాం. అప్పటికే మమ్మల్ని ఆయన అనేక రకాలుగా వాడుకున్నారు. మళ్లీ ఆయనే ఫోన్‌ చేసి దళితబంధు విషయం మాట్లాడాలంటూ బెల్లంపల్లిలోని ఇంటికి రావాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లడం జరిగింది. కొద్దిసేపటికి పోలీసులను పిలిపించారు. మమ్మల్ని అక్రమంగా మూడు రోజులపాటు బంధించారు. పోలీ్‌సస్టేషన్‌లో టార్చర్‌ చూపించారు. మాపై తప్పుడు కేసులు బనాయించి నాలుగో రోజు ఆదిలాబాద్‌ జిల్లా జైలుకు రిమాండ్‌కు తరలించారు. 20 రోజుల తర్వాత కండీషన్‌ బెయిల్‌పై బయటకొచ్చాం. ప్రతి శని, ఆదివారాల్లో బెల్లంపల్లి టూ టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో మేం హాజరవ్వాలి. ఈ క్రమంలో పోలీ్‌సస్టేషన్‌కు వెళుతున్న మమ్మల్ని ఎమ్మెల్యే మనుషులు లక్షెట్టిపేట నుంచి వెంబడించారు. ఈ విషయమై అక్కడి ఎస్సైకి కేసు నమోదు చేయాలని కోరగా, వ్యక్తిగతంగా రావాలని సూచించారు. మాకు థ్రెట్‌ ఉంది, రాలేం అనంటే కూడా వినిపించుకోలేదు. బెల్లంపల్లి ఎమ్మెల్యే, ఆయన మనుషులతో ప్రాణహాని ఉన్నందున కాపాడాలని వేడుకుంటున్నాను’అని శైలజ ముగించారు.

అయితే ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించారు. ఆరిజిన్ డెయిరీ నిర్వాహకులు తనుపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. సబ్సిడీపై గేదెల యూనిట్లు ఇస్తామని చెప్పి బెల్లంపల్లి ప్రాంతంలో చాలామంది రైతుల దగ్గర వాళ్లు రూ.3.50 లక్షల చొప్పున వసూలు చేశారన్నారు. యూనిట్లు ఇవ్వకుండా రైతులను ఆరిజన్ డెయిరీ నిర్వహకులు మోసగించారన్నారు. బాధిత రైతులు తనను సంప్రదించడంతో డెయిరీ నిర్వాహకులను పోలీసులకు అప్పగించానన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాట్సాప్ చాటింగ్లతో తన సంబంధం లేదని అన్నారు. రాజకీయంగా దెబ్బతీసేందుకు తనకు గిట్టని వారు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని చిన్నయ్య మండిపడ్డారు.