సుజనాకు షాక్ ఇచ్చిన నేషనల్ మెడికల్ కౌన్సిల్

సుజనా చౌదరి మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు

MP Sujana Chowdary
sujana-chowdary-medical-college-license-revoked

హైదరాబాద్‌ః బిజెపి నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన మెడికల్ కాలేజీ గుర్తింపును రద్దు చేసింది. ఈ విద్యా సంవత్సరానికి (2023-24) గాను అడ్మిషన్లను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ శివార్లలోని ఘన్ పూర్ లో మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట మెడికల్ కాలేజీని సుజనా చౌదరి ఏర్పాటు చేశారు. ఈ కాలేజీని 2002లో ఏర్పాటు చేశారు. యూనివర్శిటీ కౌన్సిలింగ్ కింద ఏటా 100 అడ్మిషన్లను కేటాయించేవారు. 2017లో సీట్ల సంఖ్య 150కి పెరిగింది. ఇప్పుడు మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది.