మంచిర్యాల ఏసిపి బదిలీ

హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తు ఉత్తర్వులు

telangana state police logo
telangana state police logo

మంచిర్యాల: తెలంగాణలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. అత్యవసరమయిన వారికి మాత్రమే వెహికల పాస్‌లు ఇస్తున్నారు. ఈ తరుణంలో మంచిర్యాల ఏసిపి లక్ష్మీనారాయణ నిబంధనలకు విరుద్దంగా వెహికల్‌ పాసుల జారీ చేశారని ఆరోపణలు రావడంతో అతడిపపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. విచారణలో లక్ష్మీనారాయణ నిబందనలకు విరుద్దంగా వెహికల్‌ పాసులను జారీ చేశాడని నిర్ధారణ కావడంతో అతడిపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఆయనను హెడ్‌ క్వార్టర్స్‌ కు అటాచ్‌ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/