మొబైల్, టీవీ వదలటం లేదా ?

పిల్లలు అలవాట్లు , ఆరోగ్యం , పర్యవేక్షణ

ప్రతి ఇంట్లో రెండేళ్ల పిల్లలు ఫోన్ లేనిదే అన్నం నోట్లో పెట్టటం లేదు. అయిదేళ్ల పిల్లలు టీవీ కట్టేస్తే చాలు. ఎవరో కొట్టినట్టు పెద్ద పెద్దన ఏడుస్తున్నారు.. అయితే ఇలా మొబైల్స్ , టీవీ లకు అలవాటు పడితే ఆ పిల్లల్లో ప్రవర్తనా పరమైన లోపాలు వస్తాయని నిపుణులు చెబుతున్నాడు. ఈ ఇబ్బందినై అధిగ మించటానికి పలు సూచనలు చేస్తున్నారు..


సాధారణంగా రెండు, మూడేళ్ళ చిన్నారులు ఆటలు, పాటల ద్వారా కొన్ని విషయాలను నేర్చుకుంటారు.. ఇందుకోసం సాధారణంగా దృశ్య, శ్రవణాలనే సాధనాలుగా ఎంచుకుంటాం. అలాగని, ప్రతి దానికీ గ్యాడేట్స్ మీదే ఆధారపడితే మాత్రం.. పిల్లలు వాటికి అలవాటు పడి మొబైల్ ఇస్తేనే కానీ, ఏ పనీ చేయనని మంకుపట్టు పట్టి కూర్చుంటారు.. బదులుగా బొమ్మలతో ఆదుకునేలా చూడాలి.. కధలు చెప్పి వారిని మరిపించాలి.. పెరట్లో తిప్పుతూ పరిసరాలను పరిచయం చేయాలి.. అయితే, ఇదేమంత తేలికైన విషయం కాదు.. తల్లిదండ్రులూ కాస్త ఓపికతో వ్యవహరిస్తే సాధ్యమవుతుంది. దీనివలన వారి మెదడూ చురుగ్గా, సానుకూలంగా పనిచేయటం మొదలుపెడుతుంది..

కాస్త ఎదిగిన పిల్లలు టీవీలకో, మొబైల్స్ కో అత్తుకుపోతుంటే,, ముందు మీ ఇంటి వాతావరణంలో ఇంకెవరైనా అలా చేస్తున్నారెమో గమనించండి.. వారితో ఆటలాడండి.. పాటలు పాడండి.. ఇవన్నీ, మీ మనసుని కూడా తేలిక పరుస్తాయి.. వారినీ గాడ్జెస్ట్స్ కి అలవాటు పడకుండా చేస్తాయి.. కాస్త పెద్ద పిల్లాలైంట్ వారి సమయాన్ని అభిరుచుల వైపునకు మళ్లించండి. స్నేయిటుల పరిచయం , ఇష్టమైన పనిచేయటం వంటివన్నీ వీ డియోలపై ధ్యాస మళ్లిస్తాయి.

మీ పనికి అడ్డం వస్తున్నారనే, కాసేపు అల్లరి చేయకుండా వుంటారనో పిల్లల చేతికి మొబైల్ ఇచ్చే అలవాటుని ముందు మీరు మానుకోండి. ఇంటి పనిలో వారినీ భాగం చేయండి. ఎప్పుడైనా వారి చేతికి ఫోన్ ఇచ్చినా. కచ్చితంగా సమయాన్ని నిర్దేశించండి.. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, భోజనం చేసేటప్పుడూ, నిద్ర పోయేటప్పుడూ , గాడ్జెస్ట్స్ జోలికి వెళ్లకుండా నియంత్రించండి.. అంతేకాదు. ఫోనులు ఇచ్చేటప్పుడు డేటా నియంత్రణలో ఉంచటం , చైల్డ్ లాక్స్ చేయటం వంటివి చేస్తే వారు అలవాటు పెడతారన్న భయం అక్కర్లేదు.

మరిన్ని పిల్లల ఆరోగ్య విషయాల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/category/specials/health/