పిల్లల్లో ఊబకాయం
చిన్నారుల పోషణ- ఆరోగ్యం-

నేటి తరాన్ని పీడిస్తున్న సమస్యల్లో ఊబకాయం ఒకటి. పెద్దల్లో మాత్రమే కాదు పిల్లలు కూడా ఊబకాయంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రొబయోటిక్ ఆహార పదార్థాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే.
వాటిలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియాలు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా జీర్ణక్రియను, జీవక్రియను మెరుగుపరచి మంచి ఆరోగ్యాన్ని అందించడానికి తోడ్పడతాయి.
అంతేకాకుండా అలర్జీని తగ్గించడమే కాకుండా, శరీరంలో రోగ నిరోధక శక్తికి ఉపయోగకరంగా ఉంటాయి.
ఈ పోషకాలు మనకు పెరుగు, బటర్ మిల్క్, పచ్చడి.. వంటి పులియబెట్టిన ఆహార పదార్థాలలో ఎక్కువగా ఉంటాయి. తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో ప్రొబయోటిక్స్ వల్ల మరింత మేలు చేకూర్చే ప్రయోజనాలు ఉన్నట్లు స్పష్టమయింది.
బాల్యం, కౌమారదశలో ఊబకాయంతో బాధపడుతున్నవారి పై జరిపిన పరిశోధనలో క్యాలరీస్ నియంత్రిత ఆహారంతో పాటుగా ప్రొబయోటిక్స్ ఇవ్వటం వల్ల జీవక్రియ శక్తివంతంగా మారి.. పిల్లలు, కౌమార దశలో ఉన్నవారు బరువు తగ్గారు.
అలాగే పిల్లల్లో గుండెపోటు, డయబెటిస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యల తీవ్రతను కూడా ఈ ప్రొబయోటిక్స్ తగ్గిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.
జీవక్రియలో ప్రొబయోటిక్స్ పాత్రను మరింతగా అర్ధం చేసుకోవాలిని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/