ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిన సింగర్ సునీత

సింగర్ సునీత ఈమె గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వందల పాటలు పాడి శ్రోతలను , సంగీత ప్రియులను అలరించింది. అలాగే చాలామంది హీరోయిన్ల కు డబ్బింగ్ చెప్పి ఆకట్టుకుంది. ఈ మధ్యనే మాంగో అధినేత రామ్ ను వివాహమాడింది. కాగా తాజాగా సునీత ప్రెగ్నెంట్‌ అయ్యిందనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ కావడం తో అంత నిజమే కావొచ్చని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఈ వార్తల ఫై సునీత క్లారిటీ ఇచ్చింది.

నేను ప్రెగ్నెంటా? నాకే తెలియదే. అది ఈ రూమర్ సృష్టించిన వారి ఆలోచనా స్థాయికి సంబంధించిన విషయం. నాకు కానీ, నా జీవితానికి కానీ సంబంధించిన విషయం మాత్రం కాదు.’ అని సునీత చెప్పుకొచ్చింది. ఈమె మాటలు బట్టి చూస్తే ప్రెగ్నెంట్‌ అనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అర్ధమవుతుంది. ఈ మధ్య సోషల్ మీడియా వాడకం బాగా పెరగడం తో వ్యూస్ కోసం చాలామంది ఫేక్ వార్తలను ప్రచారం చేయడం , బ్రతికున్న నటి నటులను చనిపోయారని ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇక సింగర్ సునీత పర్సనల్ విషయానికి వస్తే ఓ పక్క తన గానంతో అలరిస్తూనే..తమ పిల్లలను సినీ రంగం లోకి ఎంట్రీ ఇప్పించింది. ఇప్పటికే కూతురు టాలీవుడ్‌లో సింగర్‌గా రాణిస్తుంది. కొడుకు ఆకాష్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.