త‌దుప‌రి సీజే పేరును ప్ర‌తిపాదించిన చీఫ్ జ‌స్టిస్ యూయూ ల‌లిత్

సీజేఐగా జ‌స్టిస్ చంద్ర‌చూడ్ పేరును ప్ర‌తిపాదించిన ల‌లిత్

Chief Justice UU Lalit recommends Justice DY Chandrachud as his successor

న్యూఢిల్లీః భారత సుప్రీం కోర్టు 50వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ పేరును సీజేఐ యూయూ ల‌లిత్ ప్ర‌తిపాదించారు. చీఫ్ జ‌స్టిస్ యూయూ ల‌లిత్ న‌వంబ‌ర్ 8వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి సీజే పేరును వెల్ల‌డించాల‌ని కొన్ని రోజుల క్రితం జ‌స్టిస్ ల‌లిత్‌కు న్యాయ‌శాఖ లేఖ రాసింది. రిటైర్ కావ‌డానికి నెల రోజుల ముందే సీజేఐ.. కాబోయే చీఫ్ జ‌స్టిస్ పేరును సిఫార‌సు చేయాల్సి ఉంటుంది. ఆ నియ‌మం ప్ర‌కార‌మే ఈరోజను సీజేఐ యూయూ ల‌లిత్‌.. త‌దుప‌రి సీజే పేరును ప్ర‌క‌టించారు. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల ముందే నేడు సిఫార‌సు లేఖ‌ను ఆయ‌న అంద‌జేశారు.

జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ సుప్రీంకోర్టులో రెండ‌వ సీనియ‌ర్ లాయ‌ర్‌. ఆయ‌న పేరును త‌దుప‌రి సీఐగా ప్ర‌తిపాదిస్తూ రాసిన లేఖ‌ను జ‌స్టిస్ ల‌లిత్ కేంద్రానికి పంపారు. ఒవ‌కేళ జ‌స్టిస్ ల‌లిత్ చేసిన ప్ర‌తిపాద‌న‌ను కేంద్రం అంగీక‌రిస్తే, అప్పుడు జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ రెండేళ్ల పాటు సీజేఐగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తారు. న‌వంబ‌ర్ 10, 2024లో ఆయ‌న రిటైర్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ తండ్రి జ‌స్టిస్ వైవీ చంద్ర‌చూడ్ భార‌త 16వ సీజేఐగా చేశారు. ఆయ‌న ఫిబ్ర‌వ‌రి 2, 1978 నుంచి జూలై 11, 1985 వ‌ర‌కు సీజేఐగా చేశారు. జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్.. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి ఎన్నో కీల‌క తీర్పులు వెలువ‌రించారు. తాజాగా మ‌హిళ‌ల గ‌ర్భ‌స్త్రావంపై వ‌చ్చిన సంచ‌ల‌న తీర్పు ఈయ‌న ఇచ్చిందే. అవివాహిత మ‌హిళ‌లు కూడా 24 వారాల గ‌ర్భాన్ని తొల‌గించుకునే అవ‌కాశాన్ని క‌ల్పిస్తూ ఆయ‌న తీర్పునిచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/