భీమిలి వైపు భారీగా భూ కుంభకోణాలు జరిగాయిః రఘురామకృష్ణరాజు
బలవంతంగా భూములను అగ్రిమెంట్ చేయించుకుంటున్నారని విమర్శ

అమరావతిః విశాఖలో ప్రభుత్వ, ప్రైవేటు, దసపల్లా భూములను హెల్త్ రిసార్ట్ పేరిట కొనుగోలు చేశారని… అందుకే విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయాలనుకుంటున్నారని వైఎస్‌ఆర్‌సిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ భూముల కొనుగోళ్లు ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదంటారా? అని విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. లేదా శాసనసభలో మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాతే భూములు కొనుగోలు చేశామంటారా? అని అడిగారు. సీతమ్మధారతో పాటు భీమిలి అవతలి వైపు భారీగా భూ కుంభకోణాలు జరిగాయని చెప్పారు. అనకాపల్లిలో వాగులు, వంకలు పూడ్చేసి 400 నుంచి 500 ఎకరాల్లో లేఅవుట్లు వేశారని అన్నారు. బలవంతంగా భూములను అగ్రిమెంట్ చేయించుకుంటున్నారని… బాధితులు సమావేశం ఏర్పాటు చేసుకుంటే, అక్కడ వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు మోహరించి భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నించాయని చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/