కరోనా బారిన పడిన ఉపాసన

మెగాస్టార్ చిరంజీవి కోడలు , రామ్ చరణ్ భార్య ఉపాసన కరోనా బారినపడింది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ”గత వారమే కోవిడ్ సోకింది. ప్రస్తుతం కోలుకున్నా. ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుటున్నా. వ్యాక్సినేషన్ తీసుకోవడంతో స్వల్పంగానే లక్షణాలు కనిపించాయి. దీంతో వైద్యులు కొన్ని రకాల మందులిచ్చారు. వాటితోనే కోలుకోగలిగాను.

ప్రస్తుతం శారీరకంగా మానసింగా ధైర్యంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది. అలాగే కరోనా పట్ల మన జాగ్రత్తలో మనం ఉండాలి. అలాగే సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదించాలి. అనవసర భయాలు..ఆందోళనకు గురికావొద్దు. కోవిడ్ నిబంధనలు పాటించడం వల్ల నాకు వైరస్ సోకింది అన్న విషయం తెలిసింది. ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా ఉంటే వైరస్ సోకిందన్న విషయం తెలిసేది కాదని తెలిపింది. ఉపాసనకి సోకిన కోవిడ్ వేరియంట్ వివరాలు మాత్రం రివీల్ చేయలేదు.