మానిక్కం ఠాగూర్‌కు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

kavitha

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎమ్మెల్సీ కవితను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ స్కామ్ తో సంబంధం లేదని కవిత చెపుతున్నప్పటికీ..ఈడీ మాత్రం వరుస ఛార్జ్ షీట్ లలో ఆమె పేరు ప్రస్తావించడం తో ప్రతిపక్షపార్టీ లు కవితను టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆమె ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. ఇప్పటికే బిజెపి నేత రాజగోపాల్ రెడ్డి కి ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చిన కవిత..తాజాగా కాంగ్రెస్ నాయ‌కుడు మానిక్కం ఠాగూర్‌కు కూడా క‌విత గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు.

నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా బూటకమని, అవాస్తవమన్నారు. నా చిత్తశుద్ధిని కాలమే రుజువు చేస్తుంది అని క‌విత పేర్కొన్నారు. రైతు వ్యతిరేక, పెట్టుబడిదారీ అనుకూల విధానాలను బీఆర్‌ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ బహిర్గతం చేస్తారనే భయంతో బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యకు పాల్ప‌డుతుంద‌ని క‌విత పేర్కొన్నారు.

ఇదిలా ఉంటె మరోసారి ఛార్జి షీట్ లో తన పేరు పేర్కొనడం తో బుధువారం సాయంత్రం సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో కవిత భేటీ అయ్యారు. లిక్కర్ కేసులో ఈడీ చార్జిషీట్, అలాగే ఇటీవలి పరిణామాలు, సీబీఐ దర్యాప్తు విషయాలపై లీగల్ ఎక్స్ పర్ట్స్‭తో చర్చించనున్నట్లు తెలిసింది.