ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు .. నలుగురు నక్సలైట్లు హతం

Chhattisgarh: Four Naxalites killed in gunfight with security personnel in Bijapur

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లా చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్‌ , సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మంగళవారం సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసులు సైతం ఎదురుకాల్పులకు దిగి నలుగురు మావోయిస్టులను మట్టుపెట్టారు. ఘటనాస్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతోంది.