ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

నేడు హరితహారంపై స్వల్పకాలిక చర్చ

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వర్షా‌కాల సమా‌వే‌శాలు శుక్ర‌వారం తిరిగి ప్రారంభమ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే ప్ర‌శ్నోత్త‌రాలు చేప‌ట్టారు. సెప్టెంబర్‌ 24న సమావేశాలు ప్రారంభంకాగా, వర్షాల కారణంగా మూడ్రోజులపాటు వాయిదా పడిన విషయం తెలి‌సిందే. వాయి‌దా‌ప‌డిన అంశా‌లను, బిల్లు‌లను, చర్చను తిరిగి ఎప్పుడు చేప‌ట్టా‌ల‌నేది స్పీకర్‌ నిర్ణ‌యి‌స్తా‌రని అసెంబ్లీ వర్గాలు పేర్కొ‌న్నాయి.

అలాగే, పరిశ్రమలు, ఐటీ రంగం పురోగతిపై మండలిలో చర్చించనున్నారు. పర్యాటకులు, ప్రయాణికులకు వేధింపులు, మోసాలు నిరోధించేలా రూపొందించిన కొత్త చట్టం టౌటింగ్‌ బిల్లు, జీఎస్టీ చట్టసవరణ బిల్లును ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. గృహనిర్మాణ సంస్థ, ఉద్యానవన వర్సిటీ చట్టసవరణ బిల్లుపై, నల్సార్‌, పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులపై అసెంబ్లీలో చర్చ జరగనుంది.
.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/