కృష్ణంరాజుకు సినీ,రాజకీయ ప్రముఖుల నివాళులు

అనారోగ్యంతో ఈరోజు ఆదివారం ఉదయం కన్నుమూసిన రెబెల్ స్టార్ కృష్ణం రాజు భౌతికకాయానికి సినీ , రాజకీయ ప్రముఖులు నివాళ్లు అర్పిస్తూ వస్తున్నారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు ఈరోజు ఉదయం 3:16 నిమిషాలకు తుదిశ్వస విడిచారు. ఈ విషయం తెలిసి యావత్ చిత్రసీమతో పాటు అభిమానులు , రాజకీయ ప్రముఖులు షాక్ కు గురయ్యారు. సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. కొద్దీ సేపటి క్రితం ఆయన మృతదేహాన్ని కుటుంబసభ్యులు జూబ్లీహిల్స్‌లోని నివాసానికి తరలించారు.

దీంతో సినీ , రాజకీయ ప్రముఖులు , అభిమానులు కడసారి చూసేందుకు తరలివస్తున్నారు. కృష్ణంరాజు భౌతికకాయానికి మెగాస్టార్ చిరంజీవి , కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, సీనియర్‌ దర్శకులు రాఘవేంద్ర రావు నిర్మాతలు అశ్వనీదత్‌, దిల్‌ రాజు, నటులు మురళీ మోహన్‌, మహేశ్‌బాబు, అజయ్‌, సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ తదితరులు ఆయన పార్థివదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. హీరో ప్రభాస్‌ను, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతకు ముందు హాస్పటల్ కు హీరోయిన్ అనుష్క వెళ్లి నివాళ్లు అర్పించింది.