28న కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశం

హైద్రాబాద్: ఈ నెల 28న జిల్లా కలెక్టర్లతో సీఎం కెసిఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును సమీక్షించనున్నారు. అనంతరం అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశానికి కలెక్టర్లతోపాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులు, మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/