నేడు అహ్మదాబాద్ లో ప్రధాని మోడీ రోడ్ షో

pm-modi-will-hold-a-road-show-in-ahmedabad-today

అహ్మదాబాద్‌ః గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వేళ ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు అహ్మదాబాద్‌లో రోడ్ షోలో పాల్గొననున్నారు. ప్రధాని అహ్మదాబాద్‌తో పాటు సూరత్‌లో ముమ్మరంగా ప్రచారం చేయనున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు భారీగా రోడ్ షో చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. నేడు (గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. నరోడా నుంచి చంద్‌ఖేడా వరకు రోడ్ షో లో పాల్గొననున్నారు. అహ్మదాబాద్ నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాని రోడ్ షో రూట్‌ను సిద్ధం చేశారు. ప్రధాని మోడీ తొలిసారిగా 30 కిలోమీటర్ల రోడ్ షో లో అటెండ్ అవనున్నారు. అహ్మదాబాద్‌లోని అన్ని స్థానాలకు రెండో దశలో ఓటింగ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని అన్ని సీట్లను కవర్ చేస్తూ గ్రాండ్ రోడ్ షో నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ప్రధాని భద్రతకు జాగ్రత్తలు తీసుకున్నారు.

మరోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు మొదటి దశ పోలింగ్ స్టార్ట్ అయింది. 89 నియోజకవర్గాలలో పోలింగ్‌ జరగుతోంది. బిజెపి పాలిత రాష్ట్రంగా 27 సంవత్సరాలుగా ఉన్న గుజరాత్‌ను తమ సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 14,382 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ), సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ), భారతీయ గిరిజన పార్టీ (బీటీపీ) సహా 36 ఇతర పార్టీలు పోటీ చేశాయి. ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌ మొత్తం 89 స్థానాలలోనూ పోటీ చేయనుండగా ఆమ్ ఆద్మీ పార్టీ 88 స్థానాలలోనే బరిలోకి దిగనుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/