పెట్రోల్‌ బంకుల్లో నిరీక్షణకు చెక్

Petrol bunk (File)

ముంబై: పెట్రోల్‌ బంకుల్లోను ఫాస్టాగ్‌ తరహా విధానం అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమవు తున్నారు. అత్యవరస సమయంలో పెట్రోల్‌ బంకుకు వెళ్లి పెట్రోల్‌ కొట్టించేందుకు వరుస ఉంటుంది. పెట్రోల్‌ కొట్టించుకున్న తర్వాత బిల్లు కట్టేందుకు కూడా వేచిచూడాల్సిన పరిస్థితి ఉం టుంది. ఇక్కడ కూడా ఫాస్టాగ్‌ తరహా టెక్నాలజీ అమల్లోకి వస్తే ఇంధనం నింపుకున్న తర్వాత బిల్లు కట్టేందుకు ప్రత్యేకంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉండదు. టోల్‌ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఇదే తరహా టెక్నాలజీని పెట్రోల్‌ బంకుల్లోని ఫాస్ట్‌లేస్‌ పేరు తో తీసుకువచ్చేందుకు విధానాన్ని రూపొందిం చారు. ముంబైకి చెందిన స్టార్టప్‌ ఎజిఎస్‌ ట్రాన్స్‌ సాక్ట్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.

ఇప్పటికే హెచ్‌పిసిఎల్‌కు చెందిన ముంబై, నావీ ముంబై, పుణె, థానేల లోని పెట్రోల్‌ పంపుల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ టెక్నాలజీని వినియోగిం చుకునే వారు ఫాస్ట్‌లైన్‌ అనే మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసు కోవాలి. ఫాస్టాగ్‌ తరహాలోనే రేడియో ప్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ (ఆర్‌ఎఫ్‌ఐడి)రీడర్‌ స్టిక్కర్‌ను కారు ముందు భాగంలో అతికించాలి. ఏ ఇంధనం ఎత కావాలో బంకుకు చేరుకోవడానికి ముందే యాప్‌ ద్వారా ఫీడ్‌ చేసి పెట్టాలి.

బంకులోకి వెళ్లగానే అక్కడ ఉంటే ప్రత్యేక వ్యవస్థ ఆర్‌ఎఫ్‌ఐడిని రీడ్‌ చేసి ఫాస్ట్‌లేన్‌లో ఫీడ్‌ చేసిన సమాచారాన్ని పెట్రోల్‌ బంకు అటెండెంట్‌కు చేరవేస్తుంది. వారు అందుకు అనుగుణంగా ఇంధన నింపుతారు. బిల్లు కట్టేందుకు ప్రత్యేకంగా వేచి చూడాల్సిన అవసరం లేదు. ఇంధన నింపగానే వెళ్లిపోవచ్చు. యాప్‌కు అనుసంధానించిన బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపు పూర్తవుతుంది. ఆ తర్వాత మొబైల్‌కు నోటిఫికేషన్‌ వస్తుంది.

ప్రస్తుతం ముంబై, నేవీ ముంబై, థానే, పుణెల్లోని 120 హెచ్‌పిసిఎల్‌ పెట్రోల్‌ పంపుల్లో ఫాస్ట్‌లైన్‌ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇక్కడ పని తీరు తర్వాత దేశంలోని ప్రధాన నగరాలలో దీనిని అమలు చేయాలని భావిస్తున్నామని, మార్చి 2020 నాటికి దేశంలోని 10 ముఖ్య నగరాల్లోని పెట్రోల్‌ పంపుల్లో దీనిని తీసుకువస్తామని పెట్రోలియం అండ్‌ డిజిటల్‌ పేమెంట్‌ బిజినెస్‌ సంస్థ ఎజిఎస్‌ ట్రాన్‌సాక్ట్‌ టెక్నాలజీస్‌ లిమి టెడ్‌ హెడ్‌ సతీష్‌ అన్నారు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/