నా సక్సెస్‌కు అదీ ఒక కారణమే: రష్మిక మండన్నా

Rashmika Mandanna Interview Photo

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ హీరోగా రష్మిక మండన్నా హీరోయిన్‌గా రాబోతున్న చ్తిరం ‘భీష్మ. ఈనెల 21న ఈ చిత్రం విడుదల కానుంది.. ఇప్పటికే ప్రమోషన్స్‌ను వేగం చేశారు. ఈసందర్భంగా హీరోయిన్‌ రష్మిక మండన్నాతో ఇంటర్వ్యూ విశేషాలు.. ఆమె మాటల్లోనే.. ఈ వాలెంటైన్స్‌డే నాకు చాలాబోర్‌గా సాగింది.. ఒక రొమాంటిక్‌ సినిమా ఎంజా§్‌ు చేద్దామనుకుంటే 30నిముషాలకే ఆ సినిమా బోర్‌కొట్టింది. ఈ మూవీ ఇంగ్లీష్‌ మూవీ లేండి.. మళ్లీ ఏ తెలుగు మూవీ అని అడుగుతారు..

మంచి స్క్రిప్టును చూజ్‌ చేసుకోవాలి..ఆ స్క్రిప్టులో క్యారెక్టర్‌కు తగ్గట్టు కష్టపడి బాగా చేయాలి.. ఇవ్వన్నీ లక్‌ వల్ల రావు కదా.. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను అంటే ఆది నా హార్డ్‌వర్క్‌ వల్లే.. నాలో ఏ మార్పులు లేవులేండి.. వచ్చినపుడుఎలా ఉన్నానో ఇపుడు అలాగే ఉన్నాను.. స్టార్‌ హీరోలతో చేస్తున్నాను కాబట్టి ఇక ప్రత్యేకమైన కేర్‌ కూడ ఏమీ తీసుకోలేదు.. నాకు నచ్చినట్టే చేస్తూ వస్తున్నా..నేను ఇప్పటిదాకా 50 స్క్రిప్టులు దాకా రిజెక్టు చేసి ఉంటా.. మంచి కథను ఎప్పడూ వదులుకోలేదు..

ఇంత తక్కువ టైంలోనే నాకు సక్సెస్‌ వచ్చిందంటే బాగా లేని స్క్రిప్టులను రిజెక్టు చేయటం కూడ ఒక కారణమే.. సరిలేరు నీకెవ్వరు సినిమాలో నా క్యారెక్టర్‌కు తగ్గట్టు కొన్ని చోట్ల ఓవర్‌గా రియాక్ట్‌ అవ్వాలి..అందుకే అలా చేయాల్సి వచ్చింది..

ఇక విమర్శలు ఎదగటానికి ఉపయోగపడతాయి కదా.. వాటిని నేను అంగీకరిస్తాను..భీష్మలో నా క్యారెక్టర్‌ చాలా బాగుంటుంది.. నేను చేసిన డాన్స్‌, నా యాక్టింగ్‌ కూడ బాగా వచ్చాయి.. అన్నిటికి మించి సినిమాలో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది.. ప్రస్తుతం భీష్మ రిలీజ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.. మార్చి మిడిల్‌ నుంచి సుకుమార్‌-బన్నీ సినిమా చేయబోతున్నా.. తమిళ్‌లో కార్తితో ఒక సినిమా చేస్తున్నా.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/