రూ.కోటి ఆదాయం మించిన ప్రముఖులు కొందరే!

Few celebrities beyond income Rs.Crore

న్యూఢిల్లీ: రూ.కోటి కంటే అధిక ఆదాయం పొందుతున్న డాక్టర్లు, చార్టర్డ్‌ అకౌం టెంట్లు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ సంఖ్య 2,200. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న డాక్టర్లు, సిఎల సంఖ్యను వెల్లడించింది. 2018-19 ఆదాయపు పన్ను వివరాలను కూడా పేర్కొంది.

ఈ మేరకు సోషల్‌ అనుసంధాన వేదిక ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటిఆర్‌ ఫైల్‌ చేసిన వ్యక్తుల్లో 2,200మంది డాక్టర్లు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, లాయ ర్లు వంటి వృత్తి నిపుణుల ఆదాయం రూ.కోటి దాటింది. ఇది కేవలం వారి ప్రధాన ఆదాయం. ఇతర మార్గాల నుంచి వస్తున్న ఆదాయాన్ని ఇందులో కలపలేదు.

ప్రజలు దేశ అభివృద్ధి కోసం పన్నులు చెల్లించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల క్రితం కోరారు. ఎక్కువ పన్నులు ఎగ్గొట్టడంతో నిజాయితీగా పన్నులు చెల్లించే వారిపై అదనపు భారంపడుతోందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆదాయపు పన్ను శాఖ ఏకీభవించింది. ప్రధాని మోడీని సమర్థిస్తూ ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్యను పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 5.78కోట్ల మంది ఇండివిడ్యువల్స్‌ ఐటి రిటర్న్స్‌ ఫైల్‌ చేశారని తెలిపింది. రూ.50లక్షల కంటే ఎక్కువ ఆస్తులను 3.16లక్షల మంది ఇండివిడ్యువల్స్‌ పేర్కొన్నారు.

రూ.5కోట్ల కంటే ఎక్కువ ఆస్తులను రూ.8,600మంది పేర్కొన్నారు. ఐటిఆర్‌ ఫైల్‌ చేసిన వారిలో 2,200 మంది డాక్టర్లు, సిఎలు, లాయర్లు వంటి వృత్తి రంగాల్లో ఉన్నవారు రూ.కోటి కంటే ఎక్కువ ఆదాయం చూపించారు. 1.03కోట్ల మంది ఇండివిడ్యువల్స్‌ రూ.2.5 లక్షలు కాగా, 3.29కోట్ల మంది ఆదాయం రూ.2.5లక్షల నుంచి రూ.5లక్షలుగా ఉంది.

వీరి లో రూ.5లక్షలలోపు ఆదాయం చూపిన 4.32 కోట్ల మందికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవ సరంలేదు. 1.6కోట్ల మంది మాత్రమేపన్ను చెల్లిం చాల్సిఉంది. వీరిలో కోటి మంది రూ.10 లక్షల లోపు, 46 లక్షల మంది రూ.10లక్షలకు పైగా ఆదాయం చూపించారు. 3.16లక్షలమంది మాత్ర మే రూ.50లక్షల కంటే ఎక్కువసంపాదిస్తున్నారు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/kids/