చలాకీ వృద్ధుల దూకుడు!

వెబ్‌సైట్‌ పరిశోధనలో వెల్లడి

Mufigreev
Mufigreev

ఈ నయా బామ్మల తీరే వేరు. వయసు శరీరానికే కాని మనసుకు కాదని చెప్పే వాళ్లని చూశాం కానీ, వయసు తమ శరీరానికీ దూరమే అన్నట్టు ఈ వృద్ధుల దినచర్య అందరి కళ్లకు కడుతోంది.

బోల్డన్‌ అనే వెబ్‌సైట్‌ చేసిన పరిశోధనలో చలాకీ వృద్ధుల దూకుడు వెల్లడైంది.

కృష్ణారామా అనుకుంటూ కాలక్షేపం చేస్తారనుకునే 70ఏళ్ల పైబడిన వారినే ఈ వెబ్‌సైట్‌ పలుకరించగా వారి చురుకైన లైఫ్‌స్టైల్‌ చూసి విస్తుపోయే పరిస్థితి ఎదురైంది.

వీరిలో ఒకరు 82 ఏళ్ల వయసులో ప్రేమలో పడి వివాహం చేసుకున్నవారు కాగా, మరొకరు 85 ఏళ్ల వయసులో ఏకంగా రోజూ ఒక మైలు దూరం స్విమ్‌ చేస్తున్నారు.

వీరంతా ఇప్పటికీ ఏదో ఒక పని చేస్తుండటం గమనార్హం.

అరవై సంవత్సరాలు వస్తే ఇక జీవితంలో అన్ని అయిపోయాయనే చింత చాలామంది మహిళలకు వెంటాడుతుంది. నిరాశతో ఏమీ చేయలేమని భావిస్తుంటారు.

కానీ 70వ ఏట నుంచే అసలైన జీవితం ఆరంభమవుతుందని ఈ బామ్మలు నిరూపిస్తున్నారు. జుట్టు ముగ్గుబుట్టవడం ముడతలు పడిన చర్మం ఉద్యోగం దూరమవడం ఇవన్నీ వయసు తెచ్చే మార్పులే.

60 దాటగానే అన్నీ అయిపోయాయనుకునే నిర్వేదం నుంచి బయటపడి అసలైన జీవితాన్ని ఆస్వాదించవచ్చంటున్నారు ఈ నయా బామ్మలు.

వయసు శరీరానికే కాని మనసుకు కాదని చెప్పే వాళ్లని చూశాం కానీ, వయసు తమ శరీరానికీ దూరమే అన్నట్టు ఈ వృద్ధుల దినచర్య అందరి కళ్లకు కడుతోంది.

బోల్డన్‌ అనే వెబ్‌సైట్‌ చేసిన పరిశోధనలో చలాకీ వృద్ధుల దూకుడు వెల్లడైంది.

కృష్ణారామా అనుకుంటూ కాలక్షేపం చేస్తారనుకునే 70ఏళ్ల పైబడిన వారినే ఈ వెబ్‌సైట్‌ పలుకరించగా వారి చురుకైన లైఫ్‌స్టైల్‌ చూసి విస్తుపోయే పరిస్థితి ఎదురైంది.

వీరిలో ఒకరు 82 ఏళ్ల వయసులో ప్రేమలో పడి వివాహం చేసుకున్నవారు కాగా, మరొకరు 85 ఏళ్ల వయసులో ఏకంగా రోజూ ఒక మైలు దూరం స్విమ్‌ చేస్తున్నారు.

వీరంతా ఇప్పటికీ ఏదో ఒక పని చేస్తుండటం గమనార్హం.

తమ జీవితంలో అత్యంత సంతోషదాయకమైన దశ ఇదేనని వారంతా చెప్పుకొచ్చారు.

వృద్ధాప్యం జీవితంలో అత్యంత దుర్భరదశ అనుకుని అసలు వాస్తవం గ్రహించాలని వీరిని ఇంటర్వ్యూ చేయగా భిన్నమైన పరిస్థితి తమ పరిశోధనలో వెల్లడైనట్లు ఆ వెబ్‌సైట్‌ పేర్కొంది.

87 వయసులో టెన్నిస్‌

తాను ఇప్పటికి 70ఏళ్లుపైగా టెన్నిస్‌ ఆడుతున్నానని కెనడాలో ఒంటారియాకు చెందిన ముఫీగ్రీవ్‌ (87) ఇంటర్వ్యూ చేసిన వారిని షాక్‌కు గురిచేశారు.

తాను 62 ఏళ్ల వయసులో బ్రైన్‌ ట్యూమర్‌తో బాధపడినా సానుకూల దృక్పధంతో సమస్యలు అధిగమించానని వెల్లడించారు.

సమస్యలతో దిగాలుపడి కూర్చోవడం తనకు ఇష్టం ఉండదని పాజిటివ్‌మైండ్‌తో పరిగెత్తడమే తనకు తెలిసిన విషయమన్నారు.

గోల్ప్‌లో 90స్కోరు చేయడమే తన తదుపరి లక్ష్యమని చెప్పారు.

రీటా ఎలరీ మెక్గావన్‌ ఏడుపదుల వయస దాటిన ఈ బామ్మ స్విమ్మింగ్‌లో పలు వరల్డ్‌ ఛాంపియన్‌షిప్లను కైవసం చేసుకున్నారు.

రష్యాలో వింటర్‌స్విమ్మింగ్‌ వరల్‌ ఛాంపియన్‌షిప్స్‌లో తనకుగాయమైనా రేస్‌ ముగిసే వరకూ రక్తం కారుతున్నా తనకు ఆ విషయం తెలియలేదని ఎలరీ చెబుతారు.

తాను ప్రతివారం పైలెట్స్‌, స్పిన్‌క్లాసులు తీసుకుంటానని ఆరోగ్యకర ఆహారం, పరిమితంగా రెడ్‌వైన్‌ తీసుకోవడమే తన ఆరోగ్య రహస్యమని ఆమె చెప్పుకొచ్చారు.

గత ఏడాది తన కుమారుడు జేమ్స్‌ హఠాన్మరణం చావు పట్ల తొలిసారిగా భయాన్ని కల్పించిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

అప్పుడే జీవితాన్ని చాలించాలని లేదని, కానీ నా వయసు ఏటికేడు పెరుగుతూ పోతోందని అన్నారు.

అయినా తాను జీవితంలో సాధించాలనే పట్టుదలను వీడలేదని, అంటార్కిటికాను ఈదడం తన తదుపరి టార్గెట్‌ అని చెప్పారు.

రీటా గిల్మోర్‌ 87 ఏళ్ల వయసులో తన రెస్టారెంట్‌లోని 16ప్లోర్లనూ ఎక్కిదిగుతారు. కస్టమర్లు, సిబ్బందితో కలివిడిగా ఉంటూ బ్రెయిన్‌ను చురుకుగా ఉంచుకుంటానని ఆమె చెబుతారు.

మద్యం ముట్టకుండా పొగ తాగకుండా ఉండటమే తాను ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణమనే రీటా తెలిపారు.

రోజూ మేకప్‌ వేసుకోవడమే కాదు స్థానిక దుస్తుల కంపెనీకి ఇప్పటికీ మోడల్‌గా వ్యవహరిస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/