హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం..

Heavy Rain in Hyderabad
Heavy Rain in Hyderabad

హైదరాబాద్ ను వరుస వర్షాలు వదలడం లేదు. శనివారం ఉదయం మరోసారి భాగ్యనగరాన్ని భారీ వర్షం ముచ్చెత్తింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

పంజాగుట్ట, హిమాయత్ నగర్, నారాయణగూడ, కోఠి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, సైదాబాద్‌, కార్వాన్‌, షేక్‌పేట్‌, రాయదుర్గం, కాప్రా, చర్లపల్లి, ఈసీఐఎల్‌, మల్కాజిగిరి, అమీన్‌పూర్‌, మారేడుపల్లి, నాచారం, మల్లాపూర్‌, కీసర, కుత్బుల్లాపూర్‌, జగద్గిరిగుట్ట, సూరారం, ఉప్పల్‌, సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌, సుచిత్ర, బోయిన్‌పల్లి, బాలానగర్‌, బేగంపేట్‌, వారాసిగూడ, అడ్డగుట్ట, తార్నాక, మాదాపూర్‌, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసూఫ్‌గూడ, అమీర్‌పేట, మలక్‌పేట, షేక్‌పేట్‌, మెహదీపట్నం, లక్డీకపూల్‌, నాచారంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.

అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడతాయని స్పష్టం చేసింది.