ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లో షోపియాన్ జిల్లా రెబన్ ప్రాంతంలో ఘటన

terrorists killed in encounter in Jammu and Kashmir
terrorists killed in encounter in Jammu and Kashmir

షోపియాన్‌: జమ్మూకశ్మీర్‌లో షోపియాన్ జిల్లా రెబన్ ప్రాంతంలో సోమవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా.. భద్రతా సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. రెబన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్టుగా భద్రతా బలగాలకు అందింది. దాంతో వెంటనే రంగంలోకి దిగిన సైన్యం, పోలీసులు.. ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ మొదలుపెట్టారు. కొద్దిసేపటికే భద్రతా బలగాలను గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు మొదలుపెట్టారని.. దీంతో సైన్యం కూడా ఎదురు కాల్పులు జరపిందని స్థానిక పోలీసులు తెలిపారు. కొంతసేపటి తర్వాత చూస్తే ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయి పడి ఉన్నారని గుర్తించామని చెప్పారు. భద్రతా బలగాల్లో ఎవరూ గాయపడలేదని తెలిపారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/