ఎట్టకేలకు అంగీకరించిన డొనాల్ట్‌ ట్రంప్‌

అధికారాన్ని జో బైడెన్‌కు బదలాయించేందకు అంగీకరించిన ట్రంప్‌

Trump-Clears-Way-For-Bidens-Transition

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ ఎట్టకేలకు జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓటమి పాలైనట్టు అంగీకరించిన ట్రంప్, జనవరి 20 నాటికి అధికార బదలాయింపునకు తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకోవాలని సూచించారు. జో బైడెన్ నేతృత్వంలోని ట్రాన్సిషన్ టీమ్ కు ప్రభుత్వ సహకారాన్ని తాను అడ్డుకోబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేస్తూ, ‘ఏం చేయాలో అది చేయండి’ అని సాధారణ పరిపాలనా సేవల విభాగానికి ట్రంప్ చూచించారు.

కాగా, నవంబర్ 3న ఎన్నికలు ముగిసిన తరువాత, బైడెన్ విజయం ఖాయమైనప్పటికీ, ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లు రిగ్గింగ్ కు పాల్పడ్డారని, తాను బైడెన్ విజయాన్ని అంగీకరించబోనని చెబుతూ మూడు వారాల పాటు కాలం గడిపిన ట్రంప్, పెన్సిల్వేనియా, జార్జియా న్యాయస్థానాల్లో చుక్కెదురైన అనంతరం మనసు మార్చుకున్నారు. ఇక ట్రంప్ నిర్ణయాన్ని బైడెన్ టీమ్ స్వాగతించింది. అధికార బదిలీ శాంతియుతంగా, సాఫీగా సాగాలన్నదే తమ అభిమతమని పేర్కొంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/