మళ్లీ చంద్రన్న భీమా పధకం అమలు చేస్తాం – నారా లోకేష్

యువగళం పాదయాత్ర లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వరుస హామీలు కురిపిస్తున్నాడు. ఓ పక్క హామీలను కురిపిస్తూనే..మరోపక్క జగన్ సర్కార్ ఫై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేష్..శెట్టిబలిజ కులస్థులకు ఇరవై శాతం లిక్కర్ షాపుల కేటాయింపు చేస్తాం అన్నారు.

2024లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. తాము అధికారంలోకి వచ్చాక తాడిచెట్ల పెంపకం చేస్తాం. అర్హులందరికీ శాశ్వత గుర్తింపు కార్డులు అందిస్తాం. ప్రమాద బాధితులకు, క్షతగాత్రులకు మళ్లీ చంద్రన్న భీమా పధకం అమలు చేస్తాం అని ప్రకటించారు. బీసీలను పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహిస్తాం అన్నారు. జగన్ ప్రభుత్వం హయాంలో బీసీలపై 26 వేల అక్రమ కేసులు బనాయించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అమలు చేస్తాం. ఆదరణ పథకంతో ప్రతీ ఏటా మెరుగైన పనిముట్లు గీత కార్మికులకు అందజేస్తాం.” అని లోకేష్ అన్నారు.