నేడు గవర్నర్ తో భేటీ కానున్న సీఎం జగన్

అమరావతి: సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ నేడు రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5.30 కు రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ మార్పులపై గవర్నర్ కి వివరించనున్నారని సమాచారం. మంత్రుల రాజీనామాలు,కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ కు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ నెల 11 న కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ను సీఎం ఆహ్వానించనున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఏప్రిల్ 11న జరిగే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రివర్గం ఏప్రిల్ 7న సమావేశం కానుంది. ఈ సందర్భంగా మంత్రులను రాజీమానా చేయాలని సీఎం కోరనున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన వారికి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నందున పార్టీ పటిష్ట కోసం వారి సేవలను వినియోగించుకుంటారు. గవర్నర్ ఆమోదం లభించిన తర్వాత కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యక్రమం జరగనుంది. ఏప్రిల్ 11న రాష్ట్ర సచివాలయం సమీపంలోని బహిరంగ ప్రదేశంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుందని తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/