శతాబ్దాల సంప్రదాయానికి స్వస్తి పలకనున్న బ్రిటన్ రాజు కింగ్‌ ఛార్లెస్-౩?

పట్టాభిషేకం సమయంలో రాజ దుస్తులు ధరించడం ఆనవాయతీ

King Charles III To Break Centuries-Old Tradition At His Upcoming Coronation

లండన్ః మే 6వ తేదీన బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3 పట్టాభిషేకం జరగనుంది. ఈ మహోత్సవంలో శతాబ్దాల సంప్రదాయానికి ఛార్లెస్ దంపతులు స్వస్తి పలకనున్నట్టు తెలుస్తోంది. పట్టాభిషేకం సమయంలో రాజ దుస్తులను ధరించడం ఆనవాయతీగా వస్తోంది. రాజులు పట్టు వస్త్రాలను ధరించేవారు. అయితే ఈ సంప్రదాయాన్ని విడిచిపెట్టాలని ఛార్లెస్ భావిస్తున్నారని తెలుస్తోంది. రాజ దుస్తులకు బదులు ఆర్మీ యూనిఫాంలో పట్టాభిషేకానికి ఆయన హాజరయ్యే అవకాశం ఉంది.

లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఆ తర్వాతి రోజున విండ్సర్ క్యాజిల్ లో కూడా మహోత్సవ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సామాన్యులను కూడా అనుమతించనున్నారు. క్వీన్ ఎలిజబెత్-2 గత సెప్టెంబర్ లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఏడు దశాబ్దాల పాటు ఆమె బ్రిటన్ ను పాలించారు. ఆమె మరణానంతరం బ్రిటన్ రాజుగా ఛార్లెస్ బాధ్యతలను స్వీకరించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/