ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు చేర్చిన సీఐడీ

కోర్టుకు రిమాండ్ నివేదిక

Chandrababu’s name was included in the FIR by the CID

విజయవాడ: విజయవాడ ఎసిబి కోర్టులో విచారణ ప్రారంభం అయ్యింది. రిమాండ్ రిపోర్టును సీఐడీ , కోర్టుకు అందజేసింది.రిమాండ్ రిపోర్ట్ పై విచారణ మొదలైంది. ఓపెన్ కోర్టులో విచారణను న్యాయమూర్తి అంగీకరించారు. కాగా, చంద్ర బాబు తరపున సుప్రీమ్ కోర్టు న్యాయవాది సిద్ధార్ధ లూత్రా, సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సిఐడిన్యాయవాదులు వివేకాచారి , వెంకటేష్ హాజరయ్యారు. మరోవైపు ఎసిబి కోర్టు వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబును చూసేందుకు కోర్టు వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నారు.

జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/news/national/