బాబు నిద్రపోయే అవకాశం లేకుండా …పోలీసుల తీరు

సమాధానం చెప్పలేని స్థితిలో విచారణ అధికారులు

Chandrababu’s arrest: Police behavior

అమరావతి: చంద్రబాబు నాయుడును మళ్లీ సిట్ కార్యాలయానికి తీసుకు రావటంపై పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా , మళ్ళీ తనను ఎందుకు సిట్ కార్యాలయానికి తరలిస్తున్నారంటూ పోలీసులను చంద్రబాబు ప్రశ్నించారు. రిమాండ్ నివేదిక సిద్ధం కాకపోవటంతో వెనక్కి వస్తున్నట్టు పోలీసులు చెప్పినట్టు తెలిసింది.. మరోవైపు చంద్రబాబుకు నిద్రపోయే అవకాశం లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారు . చంద్రబాబును పలుమార్లు తిప్పటం పట్ల పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్ర బాబును చూసేందుకు కోర్టు వద్ద నాయకులు , కార్యకర్తలు పడిగాపులు కాస్తున్నారు.

అంతర్జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/category/news/international-news/