పవన్ సరైన నిర్ణయం తీసుకున్నారు : గంటా శ్రీనివాసరావు
తమ కూటమి ఘన విజయం సాధిస్తుందని ధీమా

అమరావతిః వచ్చే ఎన్నికల్లో జనసేన, టిడిపి కలిసి పోటీ చేస్తాయని జనసేనాని పవన్ కల్యాణ్ ఈరోజు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిసిన అనంతరం ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో టిడిపి నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. పవన్ కల్యాణ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే అని అన్నారు. టిడిపి, జనసేనలతో పాటు బిజెపి కూడా కలిసివస్తే మరింత సంతోషమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి ఘన విజయం సాధిస్తుందని, వైఎస్‌ఆర్‌సిపి సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపికి అభ్యర్థులు కూడా దొరకరని అన్నారు. జంతువులు సింగిల్ గా వస్తాయి, మనుషులు కలిసి వస్తారని పవన్ చక్కగా చెప్పారని వ్యాఖ్యానించారు.