ఈరోజు ఏఐజీ ఆస్పత్రిలోనే ఉండబోతున్న చంద్రబాబు..?

స్కిల్ డెవలప్ కేసులో అరెస్ట్ అయ్యి ..మధ్యంతర బెయిల్ ఫై చంద్రబాబు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన అనారోగ్య నిమిత్తం నాల్గు వారాల పాటు కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన రెండు రోజుల క్రితం జైలు నుండి విడుదల అయ్యారు. నిన్న హైదరాబాద్ కు చేరుకున్న ఆయన్ను.. ఏఐజీ వైద్యుల బృందం కలిసింది. చంద్రబాబు తాజా ఆరోగ్య పరిస్థితి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం చంద్రబాబు చెప్పిన వివరాలను పరిశీలించిన తరువాత ఈరోజు.. ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవల్సిందిగా డాక్టర్ల బృందం సలహా ఇచ్చింది. దీంతో ఉదయాన్నే హాస్పటల్ కు వెళ్లగా..ఆయనకు వైద్య పరీక్షలు చేసారు. వైద్య పరీక్షల అనంతరం బాబు ఆస్పత్రిలో అడ్మిట్​ అయ్యారు. చంద్రబాబు ఈరోజు ఏఐజీ ఆస్పత్రిలోనే బాబు ఉండనున్నట్లు తెలుస్తుంది.