వర్మ ‘వ్యూహం’ నికి షాక్ ఇచ్చిన సెన్సార్

వివాదాస్పద చిత్రాలకు , ట్వీట్స్ కు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ..తాజాగా వ్యూహం అనే కొత్త చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కించారు. ఇది రెండు పార్ట్‌లుగా ఆయ‌న తీస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌గ‌న్‌పై సినిమా విడుద‌ల చేయాల‌నేది వైసీపీతో పాటు ద‌ర్శ‌కుడు వ‌ర్మ ‘వ్యూహం’. కానీ వీరి వ్యూహానికి సెన్సార్ బ్రేక్ వేసింది.

సినిమాలో సీన్లు అన్నీ వ్యక్తిగత వ్యవహారాలు, మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారట. ఆ కారణంగా సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాకు పర్మిషన్‌పై రివైజింగ్‌ కమిటీకి దరఖాస్తు చేయాలని నిర్ణయించారు వ్యూహం చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్‌.