పవన్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారు – మనోహర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారంటూ అనుమానం వ్యక్తం చేసారు పార్టీ నేత నాదెండ్ల మనోహర్. ప్రస్తుతం ఏపీలో జనసేన vs వైస్సార్సీపీ గా మారింది. గత కొద్దీ రోజులుగా ప్రజల్లో జనసేన ఫై ఆదరణ పెరుగుతుంది. గత ఎన్నికల సమయంలో జనసేన ఫై పెద్దగా నమ్మకం లేని ప్రజలు ఇప్పుడు మాత్రం ఓసారి ఛాన్స్ ఇద్దాం అనే ఆలోచనలో ఉన్నారు. ఎక్కడికి వెళ్లిన కానీ ప్రజలు పవన్ కళ్యాణ్ కు బ్రహ్మ రథంపడుతూ..పవన్ కళ్యాణ్ ను సీఎం చేస్తామని చెపుతున్నారు. ఇదిలా ఉంటె వైజాగ్ ఘటన తర్వాత జనసేన ఫై మరింత నమ్మకం ఏర్పడింది.

ఈ తరుణంలో విశాఖలో చెలరేగిన ఘర్షణలు ఇప్పుడు హైదరాబాద్ కు చేరుకున్నాయని , పవన్ కళ్యాణ్ ను అనుసరిస్తు అనుమానాస్పద వాహనాలు తిరుగుతున్నాయని పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. హైదరాబాదు లో పవన్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. విశాఖ ఘటన తరువాత పవన్ కళ్యాణ్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర సందేహాస్పదంగా ఉన్న వ్యక్తులు కనబడుతున్నారన్నారు. పవన్ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు వాహనాన్ని అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. కారులోని వ్యక్తులు పవన్ కళ్యాణ్ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని నాదెండ్ల మనోహర్ చెప్పారు.

అనుసరిస్తున్న వారు అభిమానులు కాదు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత రక్షణ సిబ్బంది కూడా వారి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి కదలికలు అనుమానించే విధంగా ఉన్నాయి. బుధవారం కారులోనూ, మంగళవారం ద్విచక్రవాహనాలపై అనుసరించారు. సోమవారం అర్దరాత్రి కూడా ముగ్గురు వ్యక్తులు పవన్ కల్యాణ్ ఇంటి వద్ద గొడవ చేశారు. ఇంటికి ఎదురుగా కారు ఆపారు. సెక్యూరిటీ సిబ్బంది నివారించబోగా బూతులు తిడుతూ, దుర్భాషలాడుతూ ఘర్షణకు దిగారు. సిబ్బందిని కవ్వించి రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఆయినా సిబ్బంది సంయమనం పాటించారు. ఈ సంఘటనను వీడియో తీసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం అన్నారు మనోహర్. మరి పవన్ కళ్యాణ్ ను అనుసరిస్తుంది ఎవరు అని అంత మాట్లాడుకుంటున్నారు.