నేడు ముంబయి ఐఐటీలో ప్రసంగించనున్న చంద్రబాబు

12 గంటలకు విద్యార్థులతో ముచ్చటించనున్న చంద్రబాబు

chandrababu naidu
chandrababu naidu

అమరావతి: ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు టిడిపి అధినేత చంద్రబాబు ముంబయి ఐఐటీలో ప్రసంగించనున్నారు. ‘మేనేజ్‌మెంట్ స్కూల్  అవెన్యూస్’ పేరుతో ఐఐటీకి చెందిన శైలేష్ జె మెహతా అంతర్జాతీయ బిజినెస్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అలంకార్ పేరుతో గ్లోబల్ లీడర్ సమ్మిట్‌ను కూడా నిర్వహిస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రోజుకొకరు ఆన్‌లైన్‌లో మేనేజ్‌మెంట్ విద్యార్థులతో ముచ్చటిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు చంద్రబాబునాయుడు ప్రసంగించనున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/