పార్టీ టికెట్ ఆశించినవారికి పవన్ షాక్..

ఏపీలో అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక లో బిజీ అయ్యాయి. ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ..టిడిపి తో కలిసి బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీట్ల పంపకం అనేదానిపై ఇరు నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇదే క్రమంలో ఇతర పార్టీల నేతలు జనసేన టికెట్ కోసం ఆశిస్తూ..రాయబారాలు కొనసాగిస్తున్నారు.

తాజాగా కొంతమంది చెక్ లు అందజేయడం ఫై పవన్ అసహనం వ్యక్తం చేసారు. తమకు సీట్లు కావాలంటూ కొంతమంది ప్రముఖులు జనసేనకు విరాళాల పేరుతో చెక్కులు పంపుతున్నారు. వీటిని వెనక్కి పంపాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పార్టీలో లేకుండా చెక్కులు ఇవ్వడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. జనసేనను దెబ్బ తీసేందుకే ఇలా చేస్తున్నారని భావించారు. ఇతర పార్టీల వారికి టికెట్లు ఇచ్చేది లేదని.. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడ్డవారికే సీట్లు ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.