దేశంలో 15 జాతీయ ప్రాజెక్టుల నత్తనడక

17 నెలల్లో పోలవరం పనులు మీరు ఎంత చేశారు?..దేవినేని

devineni uma maheswara rao
devineni uma maheswara rao

అమరావతి: టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఏపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘దేశంలో 15 జాతీయప్రాజెక్టుల నత్తనడక.. 1984లో ప్రారంభమైన మహారాష్ట్ర  “గోసిఖుర్డ్” ఎప్పుడు పూర్తవుతుంది? ఇతర రాష్ట్రాల్లో దీనంగా వాటిపరిస్థితి. పోలవరాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు 70 శాతానికి పైగా పూర్తిచేశారు. 17 నెలల్లో మీరు ఎంత పనిచేశారు? ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదంటున్న రైతులకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు’ అని ఆయన నిలదీశారు. కాగా ఇతర రాష్ట్రాల్లో జాతీయ హోదా ప్రాజెక్టుల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని, అందుకే, వాటిని చూసే పోలవరంపై గత టిడిపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, నిర్మాణ బాధ్యతలు చేపట్టిందని పేర్కొన్నారు. నిధులిస్తే 2022 ఏప్రిల్‌కు పూర్తయ్యే చాన్సు ఉందని తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/