నేడు ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన

chandrababu-comments-on-jagan

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో దూకుడు కనపరుస్తున్నారు. మండు ఎండను సైతం లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ కూటమి శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఇప్పటికే అనేక జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి భారీ సభలు ఏర్పాటు చేసిన చంద్రబాబు..ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు.

ప్రకాశం జిల్లా దర్శిలో జరిగే ప్రజాగళం సభలో ఆయన పాల్గొననున్నారు. రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఈసారి తమ కూటమిని గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. ప్రజాగళం పేరుతో మరోసారి వైసీపీకి అధికారమిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ పర్యటనకు మంచి స్పందన వస్తుండటంతో పాటు పార్టీ క్యాడర్ లోనూ ఉత్సాహం నెలకొంది. ఈరోజు దర్శి టీడీపీ అభ్యర్థికి మద్దతుగా చంద్రబాబు ప్రచారాన్ని నిర్వహించనున్నారు.