మంత్రి రోజాను ఎక్కడిక్కడే అడ్డుకుంటున్న పలు గ్రామ ప్రజలు

నగరి నుండి ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని భావిస్తున్న వైసీపీ మంత్రి రోజా కు అడుగడుగునా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె పలు గ్రామాల్లో పర్యటిస్తుండగా..ఆమెను గ్రామస్థులు అడ్డుకుంటున్నారు. మా గ్రామానికి ఏ అభివృద్ధి చేసారని వస్తున్నారని నిలదీస్తున్నారు.

తాజాగా వడమాలపేట మండలం వేమాపురం గ్రామస్థులు శుక్రవారం రాత్రి రోజా ను అడ్డుకున్నారు. పూడి పంచాయతీలోని వేమాపురం గ్రామంలో మంత్రి రోజా ప్రచారం నిర్వహించడానికి ప్రచారం రథంలో వచ్చి.. ఓట్లు అభ్యర్థిస్తుండగా గ్రామస్థులు ఆమెను అడ్డుకున్నారు. తమ గ్రామానికి ఏం మేలు చేశారని ఓట్లు అడగడానికి వచ్చారని మంత్రిని నిలదీశారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు, వైసీపీ శ్రేణుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఆపై ఆమె పది నిమిషాల పాటు అక్కడే ఉండి వెనుదిరిగారు.