సిఎం కెసిఆర్‌ సాయం చేస్తామని చెప్పారు

నూతన సంవత్సరం సందర్భంగా ‘మా’ డైరీని ఆవిష్కరణలో చిరంజీవి

Chiranjeevi
Chiranjeevi

హైదరాబాద్‌: మెగాస్టార్ చిరంజీవి నూతన సంవత్సరం సందర్భంగా ఈ రోజు ఆయన ‘మా’ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ…. అందరం ఏకాభిప్రాయంతో ఉంటేనే ప్రభుత్వాన్ని మనమేదైనా అడగొచ్చని తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ఎలాంటి సాయమైనా చేస్తామని తెలంగాణ సిఎం కెసిఆర్‌ చెప్పారని అన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని కూడా సాయం చేయాలని అడుగుదామని చెప్పారు. పేద కళాకారులకు సాయం అందించాలని ఆయన అన్నారు. సినిమా అసోసియేషన్ ఓ కన్ స్ట్రక్టివ్ గా సాగిపోవాలని, ఏదైనా మంచి జరిగితే, పెద్దగా అరిచి చెప్పాలని, గొడవలు వస్తే, చెవిలో చెప్పుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. మాలో మూలధన నిధి పెరిగే కొద్దీ గొడవలు పెరుగుతున్నాయని ఎవరి పేరునూ చెప్పకుండా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తామంతా ఓ కుటుంబం వంటి వాళ్లమేనని అన్నారు. త్వరలోనే విదేశాల్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, అందరు హీరోలనూ పిలిపించి, ఓ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేసి నిధిని పెంచుదామని సూచించారు. విభేదాలు వస్తే, బయట పడకుండా పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, జయసుధ, మోహన్ బాబు, రాజశేఖర్, పరుచూరి వెంకటేశ్వరరావు, టీ సుబ్బరామిరెడ్డి తదితరులు సీన ప్రముఖులు హాజరయ్యారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/