మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు
tdp-chief-chandrababu
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. ఈనెల 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కుప్పంలో ఉండనున్నారు. ఈసందర్భంగా చంద్రబాబు రోజుకో మండలంలో పర్యటించనున్నారు. సరికొత్త ప్రణాళికతో కుప్పంలో అడుగుపెట్టనున్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత తొలిసారిగా చంద్రబాబు తన నియోజకవర్గానికి వెళ్లనున్నారు.
2019 ఎన్నికల తర్వాత వరుస ఓటములు చంద్రబాబును చుట్టుముట్టాయి. ఒక దశలో చంద్రబాబు కుప్పాన్ని వదిలేయాల్సిందేనన్న హేళన మాటలు కూడా వినబడ్డాయి. కుప్పంలో చంద్రబాబు ఇవే చివరి ఎన్నికలనే విమర్శలు కూడా వైసీపీ నేతలు బాహాటంగానే చేశారు. అందువల్ల చంద్రబాబు ఈమూడు రోజులు తన సొంత నియోజకవర్గంలోని మండలాలపై దృష్టిసారించనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/