ఆర్ఆర్ఆర్ వాయిదా పడడంతో సంబరాలు చేసుకుంటున్న చిన్న సినిమాలు

సంక్రాంతి అంటే సినీ సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఏడాది క్రితం తమ సినిమాను సంక్రాంతి బరిలో దింపాలని ప్లాన్ చేసుకుంటారు హీరోలు. అలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి కి అగ్ర హీరోలు లైన్లోకి వచ్చారు. ముందుగా ప్రకటించిన దానిప్రకారం సర్కారు వారి పాట , రాధే శ్యామ్ , బంగార్రాజు , భీమ్లా నాయక్ బరిలో నిలువాలని అనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ రావడం తో సర్కారు వారి పాట , బంగార్రాజు చిత్రాలు తప్పుకున్నాయి. ఆ తర్వాత నిర్మాతల ఒత్తిడితో భీమ్లా నాయక్ తప్పుకుంది.

చివరగా ఆర్ఆర్ఆర్ , రాధే శ్యామ్ చిత్రాలే అని అనుకున్నారు. కానీ కరోనా, ఓమిక్రాన్ దెబ్బకు చివరి నిమిషంలో ఆర్ఆర్ఆర్ తప్పుకుంది. ఇక రాధే శ్యామ్ కూడా తప్పుకుంటుందని అంటున్నారు తప్ప ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ తరుణంలో సంక్రాంతి ని క్యాష్ చేసుకునేందుకు చిన్న సినిమాలు పోటీ పడుతున్నాయి. ఒకటి , రెండు కాదు ఏకంగా డజన్ చిత్రాలు సంక్రాంతి బరిలో రాబోతున్నాయి.

దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ రెడ్డి.. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా… చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ .. సాయి కుమార్ తనయుడు ఆది… రానా దగ్గుబాటి తదితరుల సినిమాలు రేసులో ఉన్నాయి. పూర్తిస్థాయి లో ఎన్ని చిత్రాలు వస్తున్నాయో చూస్తే..

  • అతిథి దేవో భవ – జనవరి 7న
  • రానా 1945 – జనవరి 7
  • వేయి శుభములు కలుగు నీకు – జనవరి 7
  • రాధే శ్యామ్ – జనవరి 14
  • శేఖర్ – జనవరి 14
  • DJ టిల్లు – జనవరి 14
  • 7 డేస్ 6 నైట్స్ – జనవరి 14
  • సూపర్ మచ్చి – జనవరి 14
  • రౌడీ బాయ్స్ – జనవరి 14
  • విశాల్ సామాన్యుడు (డబ్ మూవీ) – జనవరి 14 (ఇంకా ధృవీకరించబడలేదు)
  • బంగార్రాజు – జనవరి 15
  • హీరో – జనవరి 15.. న విడుదలవుతున్నాయి. సంక్రాంతి రేసులో మరిన్ని చిత్రాలు చేరే అవకాశం ఉంది. వీటిలో బంగార్రాజు.. సామాన్యుడు చిత్రాలు సహా ఆశిష్ రెడ్డి-దిల్ రాజుల రౌడీ బోయ్స్ .. మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ నటించిన హీరో చిత్రాలకు కొంత హైప్ కపిపిస్తోంది.