అభిమానులకు గుడ్ న్యూస్..హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయినా కట్టప్ప

బాహుబలి ఫేమ్ సత్య రాజ్ (కట్టప్ప) హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. రీసెంట్ గా ఈయన కరోనా తో చెన్నైలోని ఓ ప్రవైట్ హాస్పటల్ లో జాయిన్ అయ్యారు. రెండు రోజుల వరకు ఈయన ఆరోగ్య పరిస్థితి తీవ్ర ఆందోళన కారణంగా ఉంది. డాక్టర్స్ కూడా ఏంచెప్పలేకపోయారు. దీంతో అభిమానుల్లో , సినీ ప్రముఖుల్లో ఆందోళన చెందారు. అయితే, ఇప్పుడు సత్య రాజ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారట. బహుబలి సిరీస్‌లో కట్టప్పగా పాపులర్ అయిన ఆయన.. ‘ ప్రతీరోజూ పండగే’ చిత్రంతో మరింతగా ఆకట్టుకున్నారు.

ఇక చిత్రసీమ ను కరోనా మహమ్మారి మరోసారి పట్టిపీడిస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు, తమన్, మంచు లక్ష్మి, త్రిష, ప్రియదర్శన్‌, వరలక్ష్మి శరత్ కుమార్ , రాజేంద్ర ప్రసాద్ , మీనా లతో పాటు పలువురు కరోనా బారినపడి చికిత్స తీసుకుంటున్నారు. ఈ ప్రాణాంతక కరోనా వైరస్ యొక్క మూడవ వేవ్ భారతదేశంలో ప్రబలంగా ఉందని సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి . ఈ సమయంలో ప్రజలందరూ మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విస్తృతంగా ప్రబలుతున్న ఒమిక్రాన్ వేరియంట్ ద్వారా దేశంలో కేసులు ఉప్పెన కొనసాగుతున్న సమయంలో సెలబ్రిటీలు సామాన్యులు అన్న తేడా లేకుండా కరోనా మహమ్మారి సెలబ్రిటీలను వణికిస్తుంది.