వివేకా హత్య కేసు బదిలీపై స్పందించిన చంద్రబాబు

ఇప్పుడు తలెక్కడ పెట్టుకుంటావ్‌ జగన్‌రెడ్డీ?.. చంద్రబాబు

Chandrababu Tour Program in Kuppam
tdp-chief-chandrababu

అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు బదిలీ చేయడంపై టిడిపి అధినేత చంద్రబాబు ట్విటర్‌లో స్పందించారు. ‘‘సొంత బాబాయ్‌ హత్య కేసు విచారణ పొరుగు రాష్ట్రానికి బదిలీ అయింది. అది కూడా నువ్వు సీఎంగా ఉండగా! తలెక్కడ పెట్టుకుంటావ్‌ జగన్‌రెడ్డీ?’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం పదవికి జగన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

కాగా, వివేకా కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తీర్పును వెల్లడించింది. ఈ కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. వివేకా కుమార్తె సునీత పిటిషన్‌పై అక్టోబర్ 19నే వాదనలు ముగియగా సుప్రీం నేడు తీర్పు చెప్పింది. ఈ కేసును కడప సీబీఐ కోర్టు నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/