మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం..ముంబయి లో 144 సెక్షన్‌ అమలు

Maharashtra political crisis: Section 144 imposed in Mumbai

ముంబయి: మహారాష్ట్రలో సంక్షోభం నేపథ్యంలో శివసేన జాతీయ కార్యవర్గం సమావేశమైంది. సమావేశంలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే హాజరయ్యారు. అయితే, అంతకు ముందు పుణేలోని ఏక్‌నాథ్‌ షిండే వర్గం ఎమ్మెల్యే తానాజీ సావంత్ ఇల్లు, కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ముంబయి లో 144 సెక్షన్ విధించారు. అలాగే ఏక్‌నాథ్ షిండే థానే నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

గౌహతిలో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం సమావేశమైంది. శివసేనకు చెందిన 38 మంది రెబల్ ఎమ్మెల్యేలు, 10 మంది స్వతంత్రులు క్యాంప్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై ఎలాంటి స్పష్టత రాలేదు. గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో జరిగిన ఎమ్మెల్యేల సమావేశం అనంతరం 38 మంది ఎమ్మెల్యేల జాబితాను ఏక్‌నాథ్ షిండే విడుదల చేశారు. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని కూల్చేందుకు షిండేకు కేవలం 37 శివసేన ఎమ్మెల్యేలు మాత్రమే అవసరం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/