మోడీ పేర్లపై కామెంట్స్.. రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష

Rahul Gandhi sentenced to 2 years in jail in Modi surname defamation case

సూరత్‌: ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని సూరత్‌ కోర్టు దోషిగా తేల్చింది. పరువు నష్టం కేసులో ఐపీసీ సెక్షన్ 504 కింద రాహుల్ గాంధీని దోషిగా పేర్కొంది. మోడీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై గుజరాత్‌ బిజెపి ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లారు. రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. విచారణ జరిపిన గుజరాత్‌లోని సూరత్‌ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే జైలు శిక్ష తీర్పు సమయంలో రాహుల్ గాంధీ కోర్టులోనే ఉన్నారు. తీర్పుతో షాక్ అయ్యారు. ఇదే సమయంలో బెయిల్ కూడా మంజూరు చేసింది సూరత్ కోర్టు.

కాగా, 2019లో కర్నాటకలోని కోలార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. దేశంలోని దొంగలందరి ఇంటి పేర్లు మోడీ అనే ఎందుకు ఉంటాయంటూ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కోర్టులో కేసు వేశారు ఓ వ్యక్తి. రెండేళ్ల విచారణ తర్వాత.. వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే 2023, మార్చి 23వ తేదీ గురువారం.. సూరత్ కోర్టుకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ప్రధాని మోడీ ప్రతిష్టకు భంగం కలిగించారని.. సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని నిర్థారించిన కోర్టు.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది.