ఉక్రెయిన్ బాధల నుంచి లబ్ధి పొందడం భారత్ కు తగదుః ఉక్రెయిన్ మంత్రి

రష్యా నుంచి తక్కువ ధరకే చమురును పొందుతున్న భారత్

ukraine-minister-comments-on-india

కీవ్‌ః రష్యా చేస్తున్న యుద్ధం వల్ల ప్రతిరోజూ తమ ప్రజలు చనిపోతున్నారని… ఇదే సమయంలో భారత్ లాభపడుతోందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమెత్రో కుబేలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం వల్ల రష్యా నుంచి తక్కువ ధరకే చమురును పొందే అవకాశం భారత్ కు వచ్చిందని అన్నారు. నైతికంగా భారత్ కు ఇది తగదు అని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ పడుతున్న బాధల వల్ల మీరు లబ్ధి పొందుతున్నట్లయితే… తమకు మరింత సాయం చేయాలని అన్నారు. మీకు చౌకగా చమురు లభిస్తుండటం వెనుక ఉన్న ఉక్రెయిన్ అనుభవిస్తున్న బాధలను చూడాలని ఇండియాను కోరారు.

రష్యాతో భారత్ వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తూనే యుద్ధం విషయంలో రష్యా తీరును వ్యతిరేకించిందని… అయితే ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు మాత్రం దూరంగా ఉందని కులేబా అన్నారు. భారత ప్రధాని మోడీకి తన స్వరంతో, శక్తితో దేన్నైనా మార్చగల స్థాయి ఉందని… అందుకే ఈ యుద్ధం త్వరగా ముగిసిపోయేందుకు భారత్ తన వంతు ప్రయత్నం చేయాలని కోరారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/