నేటి నుండి గుంటూరు లో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు నేటి నుండి మూడు రోజుల పాటు గుంటూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. మొదటి రోజు పెదకూరపాడు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన మొదలుకానుంది. నేడు సాయంత్రం అమరావతిలో రోడ్ షో నిర్వహించి పబ్లిక్ మీటింగ్ లో ప్రసంగిస్తారు.. జగన్ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మీటింగ్ లో ప్రస్తావించనున్నారు.

చంద్రబాబు పర్యటన సందర్భంగా అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు పర్యటనకు సంబంధించి చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఆ ఫ్లెక్సీలు ఎదురుగానే చంద్రబాబు నాయుడు పర్యటనను వ్యతిరేకిస్తూ వైస్సార్సీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ ఆయన పర్యటన అడ్డుకుంటామంటూ పోస్టర్లు వేశారు. ఈ పోటాపోటీ ప్లెక్సీలు ఏర్పాటుతో నియోజకవర్గాలలో పరిస్థితులు హీట్ పుట్టిస్తున్నాయి. ఫ్లెక్సీల ఏర్పాటుతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.