శ్రీకాళహస్తికి వైస్సార్సీపీ దొంగలు రాలేదు కాబట్టి..ప్రశాంతంగా ఉంది – చంద్రబాబు

శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు..వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. “నిన్న అంగళ్లు వస్తే నన్ను అడ్డుకోవాలని, దాడి చేయాలని వైసీపీ శ్రేణులు ప్రయత్నించారు. నా తమ్ముళ్లు గట్టిగా ప్రతిఘటించారు. ఇంత జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అక్కడి నుంచి పుంగనూరు మీదుగా పూతలపట్టు వెళ్లాలనుకున్నాను. కానీ నేను పుంగనూరు మీదుగా వెళ్లకూడదంట… ఈ పుంగనూరు పుడింగి చెబుతాడు.

ఎవడ్రా నువ్వు… ఏం తమాషాగా ఉందా నీకు? ఏమనుకుంటున్నారు మీరు? అని ఫైర్ అయ్యారు. వైస్సార్సీపీ వాళ్లు దాడులు చేసేందుకే వచ్చారు. వారిని పోలీసుల గృహ నిర్బంధం చేయాలా, వద్దా? కానీ పోలీసులు చూస్తూ ఉండిపోయారు. ఈరోజు శ్రీకాళహస్తికి నేను వచ్చాను… ఇక్కడ ప్రశాంతంగా సభ జరుగుతోంది… కారణం ఏంటంటే ఇక్కడికి వైస్సార్సీపీ దొంగలు రాలేదు కాబట్టి. మన మీద దాడికి వస్తే ఏం చేస్తాం… తిరగబడతాం. నువ్వు కర్ర తీసుకొస్తే నేను కూడా కర్ర తీసుకొస్తా… నువ్వు ఒక్క దెబ్బ కొడితే నేను రెండు దెబ్బలు కొడతా. వివేకా మాదిరి గొడ్డలితో చంపితే, చచ్చిపోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరన్నారు.