వరంగల్ లో సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టిన వర్మ

సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వరంగల్ లో సీక్రెట్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. వర్మ అంటేనే వివాదం..చేసే సినిమాలే కాదు చేసే కామెంట్స్ కూడా వివాదస్పదం గా ఉంటాయి. అందుకే వర్మ పేరు నిత్యం సోషల్ మీడియా లో వైరల్ అవుతూనే ఉంటుంది. గత కొద్దీ నెలలుగా సోషల్ మీడియా కే అంకితమైన ఈయన..తాజాగా ఓ బయోపిక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.
కొండా సురేఖ-మురళి లపై వర్మ బయోపిక్ తీయనున్నట్టు సమాచారం. అందుకోసం వర్మ వరంగల్‌లో సీక్రెట్ గా పర్యటిస్తున్నారు. కొండా దంపతుల విద్యాభ్యాసం వివరాలు సేకరించినట్లు సమాచారం. ఇందుకోసం వరంగల్ లోని ఎబీ కళాశాల సిబ్బంది, అధ్యాపకులను రహస్యంగా కలిసి, కొంతసేపు రహస్యంగా రాంగోపాల్ వర్మ మాట్లాడినట్టు సమాచారం. మరి కొండ దంపతుల బయోపిక్ ఎలాంటి వివాదానికి తెరతీస్తుందో చూడాలి.
కొండా సురేఖ తెలంగాణలో చురుకైన మహిళా రాజకీయ నాయకురాలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభలో ఆమె వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. వరంగల్‌లోని ఒక పద్మశాలి కుటుంబంలో కొండా సురేఖ జన్మించారు. ఆమె వివాహం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావుతో జరిగింది. 1985 లో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎల్‌బీ కాలేజీ నుంచి ఆమె బీ.కాం పూర్తి చేశారు.
మండల పరిషత్ సభ్యురాలిగా ఆమె తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరగక ముందు శాయంపేట నుంచి ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమం, ఆరోగ్యం, ప్రాథమిక విద్యా మంత్రిగా పని చేశారు. 2018 లో ఆమె తన భర్తతో సహా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో చేరారు.