21న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు చంద్రబాబు పిలుపు
విద్యుత్ ఛార్జీలను దాదాపు నాలుగు రెట్లు పెంచడం దారుణం..ఇళ్లలోనే ఉండి నిరసనలు చేపట్టాలి

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు ఏపి వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో కష్టాలు ఎదుర్కొంటున్న సామాన్యుడి సమస్యలు పట్టిచుకోకపోవడమే కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచి మరిన్ని కష్టాల్లోకి నెట్టేశారంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పటికే దేశంలోని డిస్కంలకు కేంద్ర ప్రభుత్వం రూ.90 వేల కోట్లు రాయితీలు ఇచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో విద్యుత్ ధరలు పెంచడమేంటని చంద్రబాబు నిలదీశారు. ఈనేపథ్యంలో 21న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగాలని చంద్రబాబు నాయుడు సూచించారు. కాగా టిడిపి నేతలు, కార్యకర్తలు అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో ఇళ్లలోనే ఉండి నిరసనలు చేపట్టాలన్నారు. విద్యుత్ ఛార్జీలను దాదాపు నాలుగు రెట్లు పెంచడం దారుణమని ఆయన మండిపడ్డారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/