ఈసారైనా మెగా హీరో ఖాతాలో హిట్ పడుతుందా..?

మెగా హీరోలు చెప్పుకోడానికి చాలామందే ఉన్నప్పటికీ..వరుస సక్సెస్ లు అందుకుంటున్న వారు మాత్రం ముగ్గురు , నలుగురు మాత్రమే. మిగతా వారంతా వరుస ప్లాప్స్ కొట్టుమిట్టాడుతున్నారు. వారిలో వైష్ణవ్ తేజ్ ఒకరు. ఉప్పెన తో సూపర్ హిట్ కొట్టి మెగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ , ఆ తర్వాత ఏ సినిమా కూడా భారీ విజయం సాధించలేకపోయింది. దీంతో ప్రస్తుతం చేస్తున్న అది కేశవ పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు.

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణ సంస్థ‌లు ఈ సినిమాను నిర్మిస్తుండగా..మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. యాక్షన్ మూవీ గా తెరకెక్కిన ఈ మూవీ కి జీవి ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలనాటి తార రాధిక, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ తరుణంలో మేకర్స్ ఈ చిత్ర రిలీజ్ డేట్ ను ప్రకటించి ఆసక్తి పెంచారు. ఆగ‌స్ట్ 18న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరి ఈ చిత్రమైన వైష్ణవ్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.